
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 24:
రాజ్యసభ సభ్యులు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు “ఆర్ కృష్ణయ్య” పిలుపుమేరకు ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జి డయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.ఇందులో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలో.. కళాశాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లు ఇంతే కాకుండా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 3000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్డిఓ ఆఫీస్ ను ముట్టడించి ఆఫీస్ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. ధర్నా అనంతరం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలోని అధికారి జమాల్ సయ్యద్ కు జీడయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య పాత్ర వహించి చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ,, బీసీ విద్యార్థిని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, 3000 కోట్ల పాత బకాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని, విద్యార్థులకు అందజేయకపోవడం చాలా అన్యాయమని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిడయ్య యాదవ్ తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు, , కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొని జమాల్ సయ్యద్ కు వినతి పత్రం అందజేశారు.






