నేటి నుండి ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ వర్కర్ల(కార్మికులు) నిరవధిక సమ్మె.

Spread the love

-పనిచేసే కార్యాలయం ముందు నిరసన ధర్నా

-మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

-ఆర్.లక్ష్మీనారాయణ(ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు) డిమాండ్.

జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో ఎక్స్ ప్లో జివ్ కార్మికులు నేటి నుండి నిరవధిక సమ్మెకు కార్యాలయం ముందు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ కార్మికుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మంగళవారం నుండి ఉదయం 7 గంటలకు కార్యాలయం ముందు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయకుండా మేనేజ్ మెంట్ కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఏఐ టీయు సీ నాయకత్వాన అనేకసార్లు మేనేజ్ మెంట్ వారు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని నవంబర్ ఒకటవ తేదీన యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, వీటితోపాటు అధికారులకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మరియు ,లేబర్ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు వారు వివరించారు. యాజమాన్యం కార్మికులతో 30 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేపిస్తుందని, సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోవడంలేదని అందుకే కార్మికులు విసుకు చెంది సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐటియు సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటియుసి మండలఅధ్యక్షలు తోట రమేష్, కార్యదర్శి అక్కి నరసింహారావు , జిల్లా సమితి సభ్యులు ఎస్.కె సర్వర్ , సొందే కుటుంబరావు, మంగి వీరయ్య, కార్మికులు ఎర్రయ్య యాకయ్య ,బుచ్చి రాములు, అశోకు ,బాబురావు నరసింహారావు ,మాధవరావు బాబురావు ,కార్మికులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి