దళిత గిరిజన చట్టాల”తో డైరీ తయారు చేయడం అభినందనీయం: ఎమ్మార్వో అనిల్ కుమార్

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణుజే, జనవరి 23:

మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం  ప్రాంగణంలో  దళిత గిరిజన చట్టాలతో కూడిన "కెవిపిఎస్" డైరీ క్యాలెండర్ మిర్యాలగూడ ఎమ్మార్వో '  చెన్నయ్య ల అనిల్ కుమార్ 'చేతుల మీదుగా  జరిగింది.

ఎమ్మార్వో “చెన్నయ్య ల అనిల్ కుమార్ ” మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సమగ్ర అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని, దళిత బంధు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు  వరమని  అనిల్ కుమార్ ఇంకా మరెన్నో విషయాలు  తెలిపారు.

కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు మాట్లాడుతూ..

ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మార్క్స్ జీవిత లక్ష్యమైన దోపిడీ లేని సమాజాన్ని, ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గమైన కుల వ్యవస్థను రూపుమాపడానికి తన సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గదర్శకంలో సామాజిక ఉద్యమాలు ముందుకు సాగాలని పరశురాములు తెలిపారు. నేడు దేశంలో మనోభావాల పేరిట మనుషులకు జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ప్రజల ప్రశాంతతను దెబ్బతీస్తాయని, ప్రజల మధ్య రెచ్చగొట్టడం విద్వేషాలు రగిలించడం వంటి పనులు చేయడం పెద్ద తప్పని ఆయన అన్నారు. సామాజిక ప్రజాస్వామిక హక్కులు మన దేశ రాజ్యాంగం కల్పించిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి కి ఉందన్నారు,
“కెవిపిఎస్” జిల్లాలో అనేక సామాజిక ఉద్యమాలు నిర్మించి ఫలితాలు సాధించిన సంస్థగా నిలిచిందన్నారు. గొప్ప సిద్ధాంతం, స్పష్టమైన కార్యాచరణతో “కెవిపిఎస్” అనేక విజయాల సాధించిందన్నారు. సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా “కెవిపిఎస్” నిర్మించే పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాల ని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగితే ఉద్యమిస్తున్నటువంటి యువతరం కు మనువాదం ద్వారా మన రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం పైన, సంఘటిత ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించాలన్నారు. గత 15 ఏళ్లుగా కెవిపిఎస్ ముద్రిస్తున్న డైరీ మహనీయుల జీవిత చరిత్రలతో పాటు అనేక చట్టాలు జీవోలు పొందుపరచడం జరిగిందన్నారు.
డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వీరితోపాటు
పాల్గొన్న కెవిపిఎస్ నాయకులు, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోడి రెక్క రాధిక, జిల్లా ఉపాధ్యక్షులు కోడి రెక్క మల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు దైద జనార్ధన్, తక్కలపల్లి ఏసుబాబు, బొంగరాల ఎల్లయ్య, బొంగరాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి