రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించేలా 26న “ట్రాక్టర్ ర్యాలీ”లో రైతులందరూ కదలిరండి : వీరేపల్లి వెంకటేశ్వర్లు

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 23:

రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించే విధంగా కదిలిరండి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ రైతులకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 26న మిర్యాలగూడలో జరిగే ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని “అన్నదాతలకు” పిలుపునిచ్చారు.

మిర్యాలగూడ మండలం గూడూరు లో జరిగినటువంటి ప్రచారంలో వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్ పాల్గొని మాట్లాడుతూ..

రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంలో రైతులకు వ్రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ ఏ హామీలను అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. “అన్నదాతలు” వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతుల నిర్ణయించి గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడి 80% కూడా రైతులకు రాక అప్పుల పాలవుతున్నారని అటువంటి రైతుల రుణాలను రద్దు చేయాలని రుణ విమోచన చట్టం చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం అర్హులైన రైతులందరికీ అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కౌలు రైతులందరికీ గుర్తింపు రుణ, అర్హత కార్డులు ఇవ్వాలని లేనిచో భారత దేశ వ్యాప్తంగా మరో రైతాంగ ఉద్యమానికి” ఆల్ ఇండియా కిసాన్ “సభ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే “ట్రాక్టర్ ర్యాలీ”లో రైతాంగం లక్షలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లొ వీరితోపాటు సిపిఎం సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లుట్ల సైదులు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి బాబు నాయక్, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి కృష్ణ, సీనియర్ నాయకులు వెంకయ్య, శాఖ కార్యదర్శి గోపి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి