
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 23:
మిర్యాలగూడ మండలం రాయిని పాలెం గ్రామ వాస్తవ్యులు రాగిరెడ్డి కళింగా రెడ్డి “71 సంవత్సరాలు ” గుండెపోటుతో 23వ తేదీన సోమవారం ఉదయం మిర్యాలగూడ పట్టణం లోని విద్యా నగర్ కాలనీలోని సబ్ జైల్ వీధిలో తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న “రాగిరెడ్డి కళింగారెడ్డి” స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ సింహారెడ్డి కళింగా రెడ్డి నివాసానికి చేరుకొని వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాలలు, పూలు వేసి తమ హృదయపూర్వకంగా నమస్కరించి కళింగారెడ్డికి నివాళులు అర్పించి,తమ ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. ఇంతే కాకుండా క లింగారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి “బి ఆర్ఎస్” పార్టీ అండగా ఎప్పుడూ ఉంటుందని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , పాక్స్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు.. పోలగాని శ్రీనివాస్, ఏలకాని రమణ, కాకునూరి సైదులు, పోలగాని ముత్తయ్య గౌడ్, సర్పంచ్ బోగబోయిన రాజు, మాజీ సర్పంచ్ దారం సైదులు.. లు, కాలనీవాసులు, కళింగారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొని కళింగారెడ్డికి తమ నివాళులు అర్పించారు.






