
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 23.
పినపాక మండలంలోని మద్దులగుడెం, పాండురంగపురం, రాజు పేట, సామర్లకోట, ఉప్పాక, భూపాల పట్నం, సీతం పేట, బోటిగూడెం మరియు తోగ్గుడెం గ్రామల్లోని 72 మంది వితంతువలకు గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్ధ ఖమ్మం జిల్లా వారు బియ్యం, చీరలను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ సoదర్భంగా గ్రామ సర్పంచ్ లు మాట్లాడుతూ వింతంతువులకు ఇంత మంచి సాయం చేసిన గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థను అభినందించి,ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పండు సుందర్ రావు, కల్తి థామస్, మైపా యోసేపు, గ్రామ పెద్దలు, సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణరెడ్డి, సైదులు, సతీశ్ పాల్గొన్నారు.





