
హైదరాబాద్ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
మల్కాజిగిరి,జనవరి 2022 క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సఫీగూడలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు టాక్సీ ల ద్వారా పన్ను చెల్లించి ఆదాయానికి తోడ్పడుతుంటే క్యాబ్ డ్రైవర్స్ ఓనర్స్ బతుకులు మాత్రం దుర్బలంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.క్యాబ్ డ్రైవర్ల ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారని రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్ ల పై దాడులు జరుగుతున్నాయని రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.క్యాబ్ డ్రైవర్ల ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారి జీవనాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.ఢిల్లీ,కేరళ,కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేక ఆప్ ను తయారు చేసి కార్పొరేట్ శక్తులు ప్రయాణికుల నుంచి డబ్బులను దండుకోకుండా డ్రైవర్లకు ప్రభుత్వానికి మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.రాపిడో,ఓలా బైకులు తెల్ల నెంబర్ ప్లేట్లు వేసుకొని అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్నారని ఆక్రమ రవాణాను అరికట్టాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్,అల్వాల్ కిరణ్, నేరేడుమెట్ నంద,దివాకర్,వేణు,భాస్కర్ నేత, కిషోర్,పులి ప్రసాద్,సన్నీ నేత,మహేందర్,శేఖర్,కుమార్,బాబు గౌడ్,సాయి కిరణ్,శశి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





