
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 22.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు రాజమ్మ (56) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని మృతురాలి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వారికి మనోధైర్యం కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, సొసైటీ డైరెక్టర్ కటకం గణేష్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





