రేవంత్ రెడ్డి పాదయాత్ర కు లైన్ క్లియర్: మండల కాంగ్రెస్ పార్టీ.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 22.

ఫిబ్రవరి 6న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు లైన్ క్లియర్ అయిందని రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించి విజయవంతం చేయాలని పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం పిలుపునిచ్చారు. ఫిబ్రవరి6 న భద్రాచలంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ మహాసభకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాల కు తప్పకుండా యాత్ర చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమన్నారు. పాదయాత్ర, భారీ బహిరంగ సభ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి