రానున్న రాజ్యం కాంగ్రెస్ రాజ్యం: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 19.

కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని,
బి.ఆర్.ఎస్ పార్టీ పేరుతో దేశ సమస్యలను చూపుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు.ఇచ్చిన హామీల నెరవేర్చకుండా సక్రమంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయలేని వారు దేశాన్ని ఉద్దరిస్తారంటా అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలైన నిరుద్యోగులకు కేజీ టు పీజీ, ఉచ్చిత విద్య,నిరుద్యోగ భృతి,కాంట్రాక్టు వ్యవస్థ రద్దు,దళితులకు మూడు ఎకరాల భూమి,రైతులకు ఉచిత ఎరువులు,గొల్ల కుర్మలకు గోర్లు,పోడు భూములకు పట్టాలు,నియోజకవర్గానికో ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్,నియోజకవర్గానికో పాలిటేక్నిక్ కళాశాల
ఇలా చేప్పుకుంటు పోతే వందల హామీలను ఇచ్చి నేటికి ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చిన దాఖలాలు లేవని తెలిపారు.ప్రజలు బిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.
పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో దేశంలో,ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి