
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 19.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను పినపాక, జానంపేట గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విడత కంటి పరీక్ష కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జానంపేట రైతు వేదిక కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని సర్పంచ్ బాడిశ మహేష్ చేతుల మీదుగా ప్రారంభించగా, పినపాక మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపిఓ బత్తిన శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను, నూతన పథకాలను అమలు చేస్తూ దేశానికి దిక్సూచి లాగా మారిందని వీటిలో భాగంగానే కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు .దీని ద్వారా బాధిత ప్రజలు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షలు జరిపించి నూతన కళ్లద్దాలను పంపిణీ చేయడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునికమైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి అనారోగ్యానికైనా తగిన వైద్యం అందించే విధంగా డాక్టర్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, పర్యవేక్షణ అధికారి సంజీవరావు, వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, డాక్టర్ దుర్గ భవాని, క్యాంపు మెడికల్ ఆఫీసర్ జ్యోతిలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ కె. రాజు, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ ,ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుల్లిబాబు, ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ , పంచాయతీ సెక్రెటరీ నాగిని, గ్రామ కమిటీ అధ్యక్షులు గుండం దామోదర్, సూరినేని ధర్మయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏఎన్ఎమ్స్ ,స్టాఫ్ నర్స్, ఆశా వర్కర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగినది.





