
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 19.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని కోటకట్ట ఏరియా నందు గల హరిజనవాడలోని బి. నరసింహారావు కు 36వేల రూపాయల చెక్కును, బాపన కుంటకి చెందిన వి.నాగలక్ష్మి 17,500 రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని, ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని, నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నామన్నారు.పినపాక నియోజకవర్గం లో వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతన అందించడం జరుగుతున్నది తెలిపారు.





