
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి లో హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని, గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని,కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలన్నారు.
గ్రామంలో కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలని తెలిపారు.ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులు, కళ్ళజోడు, ఉచితంగా అందిస్తారని, అంతేకాకుండా అవసరం అయిన వారికి ఆపరేషన్ చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు పంచాయతీ సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు,డాక్టర్లు,వైద్య సిబ్బంది బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





