
తిరుపతి జిల్లా( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )జనవరి 16
రేణిగుంట; ఇప్పుడు మండలంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో పక్కనున్న జిల్లాలో కూడా ఒక మనిషి పేరు వ్యాపించడం అనేకులు ఆయనే కలుసుకోవాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవాలని దీనికి గల కారణం ఏమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే అడుగడుగునా ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి సన్మానాలు అంటూ జరుగుతూ ఉంటున్నాయి ఆయన ( షేక్ ఫరీద్ బాబా) (హెచ్ .ఏ ) జబ్బార్ ట్రస్ట్ అధినేత ప్రజలకు ఏదో చేయాలని పేద ప్రజలు పట్ల తపన కలిగిన ఉన్నతమైన మనసు కలిగిన వ్యక్తి షేక్ ఫరీద్ బాబా ఇప్పుడు ఈయన పేరు తెలియని వ్యక్తులు లేరంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏ ప్రాంతము పోయిన ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది ఆయన ఒక జంతువు ప్రేమికుడు అందామా పేదల పాలిట పెన్నిధి అందామా అనాధలకు అన్నదాత అందామా ప్రతి మతాన్ని గౌరవించే మతాలకు అతీతంగా జీవించే ఒక గొప్ప వ్యక్తి అందామా ఎదుటివారిని పట్టించుకోని ఎదుటివారి ఆకలి ఎరుగని సమాజంలో మనం ఉన్నాం మనకెందుకు ఎవరు ఎటు పోతే మనం బాగున్నామా అంతే చాలు. అని చూసి చూడకుండా పోయే ఈ సమాజంలో ,(షేక్ ఫరీద్ బాబా) లాంటి గొప్ప వ్యక్తి తిరుపతి జిల్లాలో పుట్టడం అన్నది తిరుపతి జిల్లాకి ఎంతో గర్వ కారణం ఎందుకంటే అనునిత్యం ప్రజలలో మమేకమై ప్రజలకు సేవ చేయాలి ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాలి అన్న గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి (షేక్ ఫరీద్ బాబా) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణిగుంట మండలంలో సుమారు 10.15. వేల మంది ముస్లిమ్స్ మైనారిటీలు ఉన్నారని అందరూ ఒకటిగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఆయన తెలియపరిచాడు ఇంకా ఆయన మాట్లాడుతూ ముస్లిం దర్గాలు మరియు మసీదులు స్మశాన వాటికలు చక్కగా అభివృద్ధిలోకి తీసుకొని వద్దామని దీనికి ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడు సహకరించాలని ఐక్యతతోనే ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలమని ఆయన తెలిపాడు ఇదివరకే నేను కొత్త సహాయము చేశానని భవిష్యత్తులో ఇంకా సహాయం చేయడానికి ముందుకు వస్తానని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మా తల్లితండ్రులు చేస్తూ ఉండేవారు మార్గంలో ఎంచుకొని . భగవంతుడు నాకు ఇచ్చాడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పేదల పట్ల కనికరము చూపించారు ఆకలి ఉన్నవాళ్ళకు ఆకలి తీర్చే వాళ్ళు అనాధలు పట్ల దయ చూపించేవాళ్ళు అదే మార్గాన్ని నేను ఎంచుకొని నా తల్లితండ్రులకు ఆత్మ శాంతి కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాను అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అటువంటి తల్లిదండ్రుల కు నేను పుట్టినందుకు అంటూ ఆయన తెలియపరిచాడు ఇంకా మాట్లాడుతూ మూగజీవాల అంటే నాకు ఎంతో ప్రేమ అంటూ అవి కూడా మానవ జీవితంలో ఒక భాగం అంటూ అవి కూడా మనతో పాటు జీవించే హక్కు భగవంతుడు ఇచ్చాడంటూ అందుకనే మూగజీవులన్న ఆయనకు అపారమైన ప్రేమ కాబట్టి ఆయనకు కలిగినంతటలో మూగజీవాలకు ఆహారం పెడుతూ పలు పలు ప్రాంతంలో ఉన్న మూగజీవులకు ఆహారం పంచిపట్టణం అన్నది ఆయనకు ఎంతో ఆత్మ తృప్తి ఇస్తుందని ఈ సందర్భంగా తెలియపరిచాడు
ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్( ఖదీర్ భాష) మాట్లాడుతూ ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి సన్మానించడం అన్నది గొప్ప విషయంగా అదృష్టంగా భావిస్తున్నామని (షేక్ ఫరీద్ బాబా)కు ఘనంగా ముస్లిం సహోదరులు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ (ఖదీర్ భాష )తిరుపతి జిల్లాలో ముస్లిమ్స్ లో ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఉండడం అన్నది ముస్లిం మతానికే గర్వకారణం అంటూ ఆయన తెలియపరిచాడు ప్రతి మనిషిని గౌరవిస్తూ ప్రతి కులమతాలను గౌరవిస్తున్న( షేక్ ఫరీద్ )బాబాను సన్మానించుకోవడం అన్నది గొప్ప భాగ్యం అంటూ ఆయన ఈ సందర్భంగా తెలియపరిచాడు





