
జనసముద్రం న్యూస్:పుల్లల చెరువు జనవరి 16.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని చాపలమడు గు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది.ఎస్సీ కాలనీకి చెందిన చల్లగుండ్ల.చిన్న యేసు కుమారుడు వెంకటయ్యకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పులు చెలరేగి పూరిగుడిసే పూర్తిగా కాలిపోయింది.గుడిసెలోవున్న ధాన్యం,నగదు,బట్టలు, సామాగ్రి కాలిబూడిదైపోయాయి.ప్రభుత్వం ద్వారా సాయమందించాలని బాధితుడు వెంకటయ్య కోరుతున్నాడు.





