
జనసముద్రం న్యూస్ జనవరి16)
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని, మందిపాల్ గ్రామానికి చెందిన వెంకట్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా తన జీవితంలో రాజకీయంగా మరియు,యువజన సంఘాలకు చేస్తున్నటువంటి సేవలకు విశిష్ట గుర్తింపుగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శిగా మరియు అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీతగా, అదేవిధంగా ఇటీవల హైకోర్టు న్యాయవాదిగా ప్రొవిజినల్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా తన చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి మిత్రులందరు ఎంతో ఆనందం, వ్యక్తపరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరిగి ఆంజనేయులు,పల్లటి శేఖర్,అశోక్,లింగం,అంజి,బుచ్చయ్య,పాల రాజశేఖర్,నరసింహారెడ్డి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.





