జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 16:
నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మరియు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ సదరం స్లాట్ బుకింగ్ గాను శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు 2023లో జనవరి నెలలో 19,24,31 తేదీలలో మరియు మీసేవ రసీదులో తెలపబడిన సమయానికి జిల్లా ఆస్పత్రి నల్గొండ లోని సదరం కార్యాలయం వద్ద నిర్వహించు వైద్య నిర్ధారణ పరీక్షలకు తప్పనిసరిగా హాజరయ్యి దివ్యాంగులు వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డి ఆర్ డి ఓ, డి ఆర్ డి ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి మెప్మా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.





