
జనసముద్రంన్యూస్,నల్లగొండ జిల్లా ,డిండి మండలం జనవరి 16:
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం నుండి దేవరకొండ కు వెళ్లాలంటే వాహనదారులు నరకం అనుభవించాల్సిందే దేవరకొండ కు వెళ్లే దారిలో లింగమయ్య వంపు దగ్గర గల గోతులను సోమవారం రోజున ఆర్ అండ్ బి సిబ్బంది తొ డిండి నాయకులు కలిసి జె సి బి సహాయంతో మట్టి వేసి పూడిపించడం జరిగింది. డిండి గ్రామ,పరిసర గ్రామ ప్రజలు, వాహనదారులు,ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి సిబ్బంది రాజు, వెంకటయ్య నాయకులు ఆమనగంటి కృష్ణ,బోల్లె శైలేష్ తదితరులు పాల్గొన్నారు







