సంక్రాంతి పండుగను పురస్కరించుకొని “ఫ్రెండ్స్ యూత్” ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి,డి. శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 16.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలం పరిధిలోని తాటిగూడెం గ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విభిన్నమైన ముగ్గులు ఎన్నో రకాల రంగులతో అలంకరించడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. మండల పరిధిలోని తాటిగూడెం, విప్ప చెట్టు గుంపు నందు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పండుగను మరువలేమని ఆరుగాలం కష్టపడిన రైతు తన పంట చేతికొచ్చిన తరుణంలో జరుపుకునే మొట్టమొదటి పండుగగా అభివర్ణించారు. ఈ ముగ్గుల పోటీని దుర్గం ప్రేమ్ కుమార్, జిమ్మిడి ప్రకాష్, దుర్గం ప్రసాద్, ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతిభ చూపిన వారికి సాంప్రదాయ బహుమతులు అందజేశారు. ప్రతి ఇంట గ్రామంలో బంధువులతో ఇంటికొచ్చిన బిడ్డలతో, అల్లులతో సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. మొదటి బహుమతి జిమ్మీడి యాదగిరి,రెండో బహుమతి శేరి భవాని,
మూడో బహుమతి దుర్గం జ్యోతి గెలుచుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కొమరం విశ్వనాథం, కరకగూడెం ఏఎస్ఐ పాపయ్య,రావుల సోమయ్య,సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, న్యాయవాది సుందర్ రామ్, రైటర్ దుర్గారావు, స్థానిక ఉప సర్పంచ్ జాడి నాగరాజ్, శెరు శ్రీధర్, జాడి రామనాథం, జాడి దేవేంద్ర వరప్రసాద్, సెక్రెటరీ వీరన్న, మణుగూరు సెక్రెటరీ జిమ్మిడి విజయ్, దుర్గం ప్రవీణ్, శరత్, సందీప్, కిరణ్, జిమ్మిడి ప్రశాంత్, జాడి దినేష్, అర్జున్, దామోదర్, మురళి మహిళలు దుర్గం స్వాతి, మౌనిక రాణి, జాడి దీపిక, సంధ్యారాణి, మనిషా, అపర్ణ, సంజన, ప్రణవి, మంగ వేణి, లోకేశ్వరి, కళ్యాణి, సాంబలక్ష్మి, సరిత,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి