
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 16.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని స్థానిక వినీల పబ్లిక్ స్కూల్ లో 1998 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత మణుగూరులోని మౌనిక రెస్టారెంట్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొని పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పలకరింపులతో, విద్యార్థి దశలోని జ్ఞాపకాలు, బాల్య జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత తమ తోటి విద్యార్థులను కలుసుకున్నందుకు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా కేక్ కట్ చేయడం జరిగింది. గత 25 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తోటి విద్యార్థుల్లోని వీరముష్టి శ్రీను, త్రిగుల్ల శ్రీను, కోలేటి రవి ప్రసాద్ వీరు ముగ్గురు చనిపోవడంతో ఈ సమ్మేళన సభలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి కోల్పోయిన చిన్ననాటి స్నేహితులు జ్ఞాపకార్థంగా రాబోయే కాలంలో వారిని గుర్తు చేసుకునే విధంగా విద్యార్థులకు, ప్రజలకు చేతనైన సహాయ కార్యక్రమాలను చేపడతామని విద్యార్థులందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 1998 సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థులందరూ పాల్గొన్నారు.





