జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 12:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉన్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి సంఘాల ముఖ్య నాయకులైన ఐ కా స రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ, తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు, అఖిల పక్షాల నాయకులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకొని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగిందని ఆదివాసీ సంఘాల నాయకులు గొగ్గల రామకృష్ణ తెలిపారు. ఆదివాసీ సంఘాల నాయకులకు సంఘీ బావం తెలుపుతూ అక్రమ అరెస్టులను జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను నొక్కిపడుతూ, ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నారు.వివిధ మండలాల్లో జిల్లా వ్యాప్తంగా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ లల్లో నిర్బంధించబడ్డ ఆదివాసీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి జిల్లా ప్రదాన కార్యదర్శి గొగ్గల రామకృష్ణ,పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను,ప్రధాన కార్యదర్శి కుర్సo సారయ్య తదితరులు పాల్గొన్నారు.





