అయ్యప్ప స్వామి దీవెనలతో ప్రజలకు బత్తుల లక్ష్మారెడ్డి మరెన్నోసేవా కార్యక్రమాలు చేయాలి : పులిమేడు గురు స్వాములు

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 12:

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయంలో పులిమేడు ఆశ్రమ స్వాముల “ఇరుముడి మహోత్సవం” సందర్భంగా బిఎల్ఆర్ బ్రదర్స్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని “స్వాములకు అభినందనలు” తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న
గురు స్వామి కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవానికి బిఎల్ఆర్ విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందని, బత్తుల లక్ష్మారెడ్డి గత నాలుగు సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములకు కార్తీక మాసం పూర్తి దినములు “అన్నప్రసాద వితరణ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం మన మిర్యాలగూడలోనే కాకుండా చుట్టుపక్కల మండలాలలో కూడా స్వాములకు అన్నదానం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నటువంటి సేవలు అమోఘమైనవని, బి ఎల్ ఆర్ చేస్తున్న సేవల్లో ముఖ్యమైనవి..శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు “పేదింటి ఆడపడుచులకు బిఎల్ఆర్ పెళ్లి కానుక ” అందజేయడం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకం మంజూరు కావడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుందని, బిఎల్ఆర్ ఇచ్చే ఈ ‘ శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు ‘ కానుక వివాహానికి ముందే ఆడపడుచులకు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం, మెడికల్ క్యాంపులు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం, ముస్లిం సోదరి ,సోదరులకు రంజాన్ తోఫాలు, క్రిస్టియన్ సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లు, ఆరోగ్య రక్ష వాహనం లు, ఈశ్వర బంధం, వైకుంఠ రథం, ఇంకా మరెన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేపట్టారని తమ సంతోషం వ్యక్తపరిచారు.బత్తుల లక్ష్మారెడ్డి రానున్న రోజుల్లో ఎలాంటి సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చిన “పులిమేడు ఆశ్రమ వాసులు” బిఎల్ఆర్ కు మద్దతుగా ఉంటా మని , సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని, బి ఎల్ ఆర్ కు వెన్నంటి ఉండి సైనికుల లాగా క్రమశిక్షణతో ఉంటామని పులిమేడు ఆశ్రమ స్వాములు ప్రతిజ్ఞ చేశారని పులిమేడు స్వాముల గురు స్వామి శేఖర్ రెడ్డి తెలిపారు. అయ్యప్ప స్వామి దీవెనలతోఎల్లవేళలా “బిఎల్ఆర్ ” మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమా లు చేసేలా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని స్వామిని కోరుతున్నామని గురు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు.. కిషోర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, డప్పు శ్రీనివాస్ యాదిరెడ్డి.. లు, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు.. గంధం రామకృష్ణ, రవి నాయక్, కో మ్మన నాగలక్ష్మి,.. లు, వార్డు ఇన్చార్జులు.. బల్గురు శీను, ఇంద్ర వెంకటకృష్ణ,ఉబ్బపల్లి కాశయ్య, గజ్జో నాగరాజు ఫర్వేజ్ ఖాన్,ఇమ్రాన్,సికిందర్.. లు,బిఎల్ఆర్ బ్రదర్స్, కాంగ్రెస్ అభిమానులు, బిఎల్ఆర్ అభిమానులు తదితరులు అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్