
జనసముద్రం న్యూస్, జనవరి12:

పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ గ్రామానికి చెందిన కోస్గి వెంకట్ గురువారం రోజు హైకోర్టు అడ్వకేట్ గా ప్రొవిజినల్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా చౌడాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ…మట్టిలో నుంచి నలిగిన భుజాల మీద నుంచి నడుచుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ మెట్లకు అక్షరాలు నెమరు వేసుకొని ఏ జాతులయితే కోర్టు మెట్లు ఎక్కలేదు ఏ జాతులయితే చట్టాలకు దూరంగా ఉన్నారో,ఈ రోజు లాయర్లుగా,జడ్జీలుగా అవుతున్నామంటే కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని,అదేవిధంగా అంబేద్కర్ వారసునిగా సమాజానికి చెప్పినటువంటి వ్యక్తి వెంకట్,చిన్నతనంలో ఆకలి తిని పారేసిన బాల్యాన్ని అవమానాన్ని మూటగట్టుకుని కష్టాలు అనే భూకంపాన్ని తొక్కుకుంటూ వారి గ్రామంలో జరిగిన కుల వివక్ష పోరాటంలో ఆత్మగౌరవం కోసం న్యాయ పోరాటం చేసినటువంటి వ్యక్తి నేడు న్యాయవాది అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అని మండల అంబేద్కర్ యువజన సంఘాల తరఫున మరోమారు మనస్ఫూర్తిగా హర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అశోక్,ప్రధాన కార్యదర్శి కుమార్, మండల అంబేద్కర్ యువజన సంఘాల సలహాదారులు మురళీకృష్ణ కిష్టయ్య ప్రసాద్ శ్రీనివాస్ కృష్ణ కొత్తపల్లి శ్రీనివాస్ చింటూతదితరులు పాల్గొనడం జరిగింది.