
జన సముద్రం న్యూస్, అవంతిపురం, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 12:

కాలనీవాసులు పడుతున్న కష్టాలు చెప్పుకోలేనివి. కొత్త కాలనీవాసుల సమస్యల గురించి తెలుసు కోవడానికి మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి మండల అధికార బృందంతో పరిశీలించడానికి విచ్చేశారు.
కొత్త కాలనీ గ్రామ నివాస ప్రజలు ఎంపీడీవో “గార్లపాటి జ్యోతిలక్ష్మి”కి తమ సమస్యలను గురించి మాట్లాడుతూ..
కొత్త కాలనీ గ్రామవాసులు మాకు సొంత ఇల్లు లేవని, పూరి గుడిసెలలో నివాసం ఉంటున్నామని, మేము రాత్రిపూట నిద్రించు సమయంలో సర్పములు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, సర్ప కాటు వల్ల కొంతమంది మరణించారని ఎంపీడీవో జ్యోతిలక్ష్మికి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఇంతే కాకుండా మాకు త్రాగునీటి సౌకర్యం అంతంత మాత్రమేనని, డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్డు సమస్య లతో ఇబ్బంది పడుతున్నామని, కొన్నిసార్లు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని, మేము “ఆకలి ద ప్పులతో” జీవనం సాగిస్తున్నామని ఇంకా మరెన్నో విషయాలు ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మికి కొత్త కాలని గ్రామం వాసులు తమ సమస్యలను తెలియజేశారు. కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలను తెలుసుకున్న మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి స్పందించి మీ సమస్యలను మండలం ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి కి తెలియజేసి,ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలు పరిష్కారమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని గ్రామ వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి జ్యోతిలక్ష్మితోపాటు మండల ప్రజా పరిషత్ అధికార బృందం, కొత్త కాలనీ గ్రామవాసులు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు
