
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 12:

త్వరలో జరిగే కులగణనలో బీసీలను కులాల వారిగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఎవరు అడగకుండానే కులగణనపై అసెంబ్లీ లో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ రాష్ట్ర తరహాలోనే కులగణన చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని వాళ్ళే చేస్తారని నెపం వారిపై నెట్టి ఊరుకోరాద ని,బిజెపి వ్యాపార పార్టీ అని లింగం గౌడ్ తెలిపారు, కులగణన వర్గాల పార్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి బిజెపి పార్టీ కులగణన చేస్తుందనే నమ్మకం లేదని,అందుకే బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు పూనుకున్నారని తెలిపారు.చాలా విషయాల్లో తమ పాలన దేశానికి ఆదర్శమని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేసి మరింత ఆదర్శవంతంగా నిలబడుతారని కోరుకుంటున్నట్లు జాజుల లింగం గౌడ్ తెలిపారు.కులగణనతోనే బీసీలకు రావాల్సిన వాటా దక్కుతుందని బీసీల పక్షాన ఉంటూ తమ ఆవేదన వ్యక్తపరిచారు.