
మెదక్ ప్రతినిధి, (జనసముద్రం న్యూస్ ) డిసెంబర్ 12 :

క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం ఏం. పొందుతుందని మెదక్ డీఎస్సీ సైదులు, కొల్చారం జడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల, ఎంపీపీ కోరబోయిన మంజుల అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొల్చారం జిల్లా పరిషత్ ఆవరణలో యువ జన వారోత్సవాలు పురస్కరించుకుని మం | డలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను బుధవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వామి వివేకానందుని మాటలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సెల్ఫోన్ వచ్చాక శారీరక శ్రమ తగ్గిపోయి, ఫోన్ గేమ్ లు ఆడుతున్నారన్నారు. యువ ఈ భేదాభిప్రాయాలు లేకుండా క్రీడల్లో బాగా రాణించాల న్నారు. కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఉమ, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈవో నీలకంఠం, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్, బీఆర్ఎస్ నాయ కులు ముత్యంగారి సంతోష్ కుమార్, కాళీ, నాధ్, పీఈటీ శ్రీనివాస్ రావు, ఏఎస్సై
తారాసింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





