జనసముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి :11

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో శివారులో ఉన్న ఐ ఎం ఎల్ డిపోలో హమాలీ పని కల్పించాలంటూ గత మూడు నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు స్పందించడం లేదని జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు డిపో ముందు చిన్న గణపురం నిరుద్యోగ యువకులు మోకాళ్లపై నిలబడి ప్రదర్శన చేశారు. అనంతరం జేఏసీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. ఐఎంఎల్ డిపోలో ఇంత అన్యాయం జరుగుతున్నా డిపో మేనేజర్ పాత అమాలీలతో కుమ్మక్కైనట్టు విమర్శలు వస్తున్నాయని జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు అన్నారు. తక్షణమే డిపో మేనేజర్ స్పందించి నిరుద్యోగ యువకులకు ఐఎంఎల్ డిపోలో అమాలి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కమిటీ సభ్యులు పులే బోయిన మల్లేశం , సోమ నర్సింలు, లక్ష్మి నారాయణ గౌడ్, కమ్మరి మల్లేశం , లంబాడి రవి, మోతిలాల్ , మోహన్, రమేష్, కృష్ణ జేసి ఉద్యమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





