చిలిపిచ్చేడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

Spread the love

జన సముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి 10:

మెదక్ జిల్లా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని మెదక్ జిల్లా చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్.ఐ. గౌస్ ఎస్పీ గారికి వివరించారు. అనంతరం ఎస్పీ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీసులకు సూచించారు, ఆన్ లైన్ వినియోగించు విధానము పై అందరికి అవగాహన ఉండాలని, టీఎస్ సి ఓ పి ఎస్ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి పెండింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే జిల్లా ఎస్.పి.గారితో పాటు ఎంపీపీ వినోద దుర్గా రెడ్డి ,సర్పంచ్ లక్ష్మీ దుర్గా రెడ్డి ,సర్వేయర్ రవి ప్రసాద్ గారు చిలిప్చేడ్ నూతన పోలీస్ స్టేషన్ కోసం శీలంపల్లి ఎక్స్ రోడ్ వద్ద స్థల పరిశీలన చేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి