జన సముద్రం న్యూస్,మెదక్ జిల్లా ప్రతినిధి, జనవరి :11

తెలంగాణ నూతన సిఎస్ గా అప్పటి మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ శాంతి కుమారి నియామకంపై ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా గా ఉన్నప్పుడు శాంతి కుమారి ఐపిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కు కలెక్టర్ గా పనిచేశారు. ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లా పై ప్రత్యేకంగా అవగాహన ఉంటుందని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అన్నారు. ఆమె తెలంగాణ నూతన సీఎస్ గా నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తెలిపారు.





