సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత “కంటి వెలుగు”ను జయప్రదం చేయాలి: ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 11:

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనవరి 18 నుంచి వందరోజులపాటు జరగబోయే రెండో విడత “కంటి వెలుగు కార్యక్రమాన్ని” విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్తు గౌరవ అధ్యక్షులు నూకల సరళ హనుమంత్ రెడ్డి మండల అధికారులను ఆదేశించారు .మిర్యాలగూడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలం ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి అధ్యక్షతన రెండో విడత “కంటి వెలుగు” అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించబడింది.

రెండో విడత “కంటి వెలుగు” అవగాహన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ జనవరి నెల 18 నుంచి ప్రారంభమైయే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ సుమారు 60 లక్షలు మందికి నేత్ర వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ “కంటి వెలుగు “కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సుమారు 250 కోట్లు కంటి చూపు తక్కువ ఉన్న వయోవృద్ధుల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. కళ్లద్దాల పంపిణీ విషయంలో ఎ టువంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని ఇంకా మరే న్నో విషయాలు తెలిపారు.

ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కంటి చూపుతో బాధపడుతున్న వయోవృద్ధులకు సీఎం కేసీఆర్ పెద్దకొడుకు లాగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి నేత్ర వైద్యం అందిస్తున్నారని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. జనవరి 18 నుంచి వంద రోజులు పాటు జరగబోయే కంటి వెలుగు కార్యక్రమం ను రేపు, ఎల్లుండి గ్రామస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని,మండలంలోని అన్ని కార్యాలయాల్లో పోస్టర్ లు అంటించి,మండల ప్రజలకు తెలిసే విధంగా చేయాలని మండల అధికారులను ఆదేశించారు.ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వయోవృద్ధులకు కంటి చూపు తక్కువ ఉన్న వారికి “కంటి వెలుగు”కళ్లద్దాలు పంపిణీ “కంటి వెలుగు” కార్యక్రమాన్ని మండల కార్యాలయ అధికారులందరూ ఎటువంటి ఆటంకాలు, అవకతవకలు జరగకుండా చూసుకొని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాలని అధికారులకు ఇంకా మరెన్నో విషయాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు మిర్యాలగూడ ఎమ్మార్వో అనిల్ కుమార్, జడ్పిటిసి విజయసింహారెడ్డి, మండల పంచాయతీ అధికారి, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఐకెపి సిబ్బంది, మొయిద్, కార్యాలయ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి