బి ఆర్ ఎస్ బహిరంగ సభ జయప్రదానికి సైనికుల్లా పనిచేయాలి: పగడాల.సతీష్ రెడ్డి.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 11.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు గల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 18వ తేదిన ఖమ్మంలో జరిగే బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రతి గ్రామ పంచాయితీ నుండి కార్యకర్తలను సిద్దం చేయాలన్నారు. పినపాక మండలంలో అన్ని గ్రామాల్లో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపిటిసి లు సొసైటీ డైరెక్టర్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, నాయకులు, కార్యకర్తలు భాధ్యత తీసుకొని ఈ నెల 18 వ తేదిన ఖమ్మంలో జరిగే బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు సమావేశాలు నిర్వహించి జన సమీకరణ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవివర్మ,వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి,రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, బుల్లిబాబు, బెడద సురేందర్‌, డాక్టర్ శ్రీరామ్‌, కటకం గణేష్‌, పోలిశెట్టి సత్తిబాబు, వడ్లకొండ శ్రీను, చిన్నారి, సోంపల్లి తిరుపతి, ఎంపీటీసీలు కాయం శేఖర్, చింతపoటి సత్యం, సర్పంచ్‌లు మొగిలిపల్లి నర్సింహారావు, బాడిశ మహేష్‌, నాయకులు గాండ్ల అశోక్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి