
జన సముద్రం న్యూస్ పరిగి జనవరి 10
భారత (తెలంగాణ)ప్రవేట్ ఉద్యోగ సంఘం [ టిపియుఎస్] రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వికారాబాద్ జిల్లా ఆనంతారం కు చెందిన జె.నరేష్ గౌడ్ గారిని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారు మరియు వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు మెతుకు ఆనంద్ గార్ల సమక్షంలో ప్రవేట్ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు గారు నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిపియుఎస్ రాష్ట్ర సెక్రటరీ సంపత్ గారు, టిపియుఎస్ నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గార్లు నరేష్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి ప్రవేట్ ఉద్యోగుల సమస్యల పోరాటం చేస్తూ అండగా నిలువాలని మరియు బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నరేష్ గౌడ్ నియామకం.





