సంక్రాంతి పండుగ దృష్ట్యా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం

Spread the love

జనసముద్రం న్యూస్, సైబరాబాద్, జనవరి 10:

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో, క్రైమ్స్ విభాగం అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సంక్రాంతి పండుగ దృష్ట్యా పోలీసులు చెప్పటాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులుండటంతో చాలా మంది ప్రజలు వారి సొంత ఊళ్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటారని అయితే ఇదే అదనుగా స్థానిక, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు దొంగతనాలకు పాల్పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యం లో రాత్రి వేళల్లో జరిగే చోరిల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలు ధైర్యంగా ఊరెళ్లి, సంతోషంగా పండుగ జరుపుకోవాలని సీపీ అన్నారు రాత్రి సమయంలో నివాస ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచి, రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు
ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి పగలు ఆటోమొబైల్ దొంగతనలు జరగకుండా క్రైమ్స్ హాట్ స్పాట్ లలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం ప్రత్యేక నిఘా పెట్టి, పిఏస్ఐఓసి ద్వారా మనీటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు అందేలా చేస్తున్నామన్నారుప్రజలు తమ ప్రాంగణంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోనేలా, కాలనీలలో అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేసేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు
పాత నేరస్థులు మరియు ఇటీవల జైలు నుండి విడుదలైన వారి కార్యకలాపాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, అనుమానితులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తు నేర నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు కమీషనరేట్ పరిధి సరిహద్దు ప్రాంతాల పోలీసు స్టేషన్ వారు సరిహదు పోలీసు స్టేషన్ల వారితో సమన్వయం చేసుకుంటూ పెట్రోలింగ్, రైల్వే పోలీసులతో కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి వాహనాలను నడుపుకోవాలన్నారు ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డీసీపీ సందీప్, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహా రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి