జనసముద్రం న్యూస్,రాప్తాడు, జనవరి 9:

శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు చేయూతను అందిస్తామని సిపిఐ మండల కార్యదర్శి ఆర్.రవీంద్ర పేర్కొన్నారు. రాప్తాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన పి వై ఆంజనేయులు ను సిపిఐ మండల నాయకులు సోమవారం కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ తరఫున నిత్యం పోరాటాలు చేస్తుంటామని అందుకు పోలీసు సిబ్బంది తరపున సహకారం అందించాలని కోరారు. ఎస్ఐ స్పందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలకు చట్టం పరిధిలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ఏం చలపతి ఎస్.బాష,మౌలాలి, బ్రహ్మయ్య బాష తదితరులు పాల్గొన్నారు.





