నవరత్నాల పథకాలు దేశానికి ఆదర్శం:మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి

Spread the love

జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09:

అమడగూరు న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు దేశానికే ఆదర్శమని వైసిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి (సూరి) కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.అనంతరం కేకు కట్ చేసి పంచిపెట్టారు.ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని,సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడన్నారు.అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేసాడన్నారు.సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల వద్దకు అధికారాన్ని తెచ్చారన్నారు.నాడు-నేడు పథకాలతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.నవరత్నాల పథకాల వల్ల అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరిందన్నారు.ముఖ్య
మంత్రి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శనీయమని తెలిపారు.అనంతరం పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ గావించారు.ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు అధ్యక్షులు బొమ్మిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి,సర్పంచులు షబ్బీర్,శ్రీధర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,సచివాలయ కన్వీనర్లు దొడ్డప్ప,లోకేష్ రెడ్డి,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు,డీలర్ల సంఘం అధ్యక్షులు కొండారెడ్డి,ఆదినారాయణ,అమర్నాథ్ రెడ్డి,ఉప సర్పంచ్ నవీన్,ఫకీర్ రెడ్డి,శివరాం,రోశయ్య,వాలంటీర్లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్