జనసముద్రం న్యూస్,జనవరి 9:బుక్కరాయసముద్రం:

బుక్కరాయసముద్రం మండలం, చెన్నంపల్లి గ్రామానికి చెందిన కురుబ పెదయ్య గారి భూమిని కొంతమంది వైసీపీ స్థానిక నేతలు అధికారం ఉపయోగించి ప్రభుత్వం ద్వారా అక్రమంగా అతని భూమిని స్వాధీనం చేసుకొని జగనన్న ప్లాట్లు వేయాలని చూస్తున్నారు, బాధితులు కురుబ సంఘం దగ్గరికి వచ్చి సమస్య తెలపడం జరిగింది వెంటనే జిల్లా కురుబ యువజన సంఘం స్పందించి ఆ.ర్డి.ఓ, కలెక్టర్ వారి దగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. కావున అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిశీలించి మా కులస్తుడైన కురుబ పెదయ్య గారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మా కురుబల వృత్తి గొర్రెలు కాస్తు మా జీవనం సాగిస్తూ ఉంటాం మా ప్రైవేట్ పట్టా భూమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణ మరెడ్డి, పల్లికాటమయ్య,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





