జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09:

అమడగూరు న్యూస్: మండల పరిధిలోని మామిడి అకులపల్లి గ్రామానికి చెందిన వల్లిపి వెంకటప్ప (72) గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం పాలై సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మండల వడ్డెర సంఘం నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల వడ్డెర సంఘం నాయకులు క్రిష్టప్ప,అంగడి అమర,మాజీ ఎంపీపీ రామచంద్ర,తిరుపాల్,సోము,తదితరులు పాల్గొన్నారు.





