జనసముద్రం న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09:

అమడగూరు న్యూస్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న జయంతిని ఈనెల 11న అమడగూరు మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండల వడ్డెర్ల సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా మండల వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు క్రిష్టప్ప మాట్లాడుతూ…స్వాతంత్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనకు స్వాతంత్రం అందించారని అందుకే వడ్డే ఓబన్న జయంతిని కుల మతాలకు,రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని అంగడి అమర,తిరుపాల్,రామచంద్ర లు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.





