జనసముద్రం న్యూస్ పుల్లల చెరువు,జనవరి 9:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు దేశానికే ఆదర్శమని వైసిపి మండల కన్వీనర్ బోగోలు.వెంకట సుబ్బారెడ్డి కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేకు కట్ చేసి పంచిపెట్టారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి, ఎంపీటీసీ రాములు మాట్లాడుతూ, వైసిపి ఆధినేత జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని, సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడన్నారు.అధికారంలోకి రాగానేనవరత్నాల పథకాలతో ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేసాడన్నారు. సచివాలయవ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల వద్దకు అధికారాన్ని తెచ్చారన్నారు.నాడు..నేడు పథకాలతో పాఠశాల ల అభివృద్ధికి కృషిచేసాదని అన్నారు. నవరత్నాలపధకాలవల్ల అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసే అభివృద్ధి ని చూసి తట్టుకోలేక టిడిపి విమర్శలుచేస్తుందన్నారు.టిడిపి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సామాన్య ప్రజల ను రక్షించుకొనేందుకే జీవో నెంబర్ 1 ను పవేశపెట్టాడాని,కానీ జోవో ను అడ్డుపెట్టుకొని టిడిపి రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి మద్దతు తెపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాగ్యానాయక్,వైసీపీ నాయకులు కె.జానకీ రఘు,ఆవుల కోటిరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి,వి.వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిటిసి డి.వెంకటేశ్వర్లు, కె.రమణారెడ్డి,కో ఆప్షన్ సభ్యులు బాజీ, కె.కాశయ్య, డి.ఖాసీంవలి, గొడుగు అంజి, సుందర రావు, ఎల్ ప్రసాద్, హనుమంతు నాయక్, లక్ష్మణ నాయక్, టి మూర్తి, మహిళా నాయకురాలు సావిత్రి,రమణమ్మ, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





