జనసముద్రం న్యూస్,జంగారెడ్డి గూడెం,జనవరి 9 :

ఈ రోజు అనగా ది 9.1.2023 సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి మైసైనగూడెం వయా శ్రీనివాసపురం రోడ్డు నిర్మించాలని శ్రీనివాసపురం సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు చేపట్టిన మహా పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి ముందుగా శ్రీనివాసపురం సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి నీటికి 40 పూర్తయిన సందర్భంగా నివాళులర్పించి అనంతరం పెద్ద ఎత్తున పాదయాత్రగా బయలుదేరి శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రి జేపీ సెంటర్ గంగానమ్మ గుడి సెంటర్ మసీదు సెంటర్ మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కొంత దూరంలో పోలీసులు వాహనాన్ని అడ్డుగా పెట్టి మీకు పర్మిషన్ లేదు వెళ్ళటానికి వీలులేదని అడ్డుకోవడంతో మేము ప్రజాస్వామ్య మార్గంలో శాంతియుతంగా మా యొక్క సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయడానికి వెళుతుంటే ఈ రకమైన అడ్డంకులు సృష్టించడం సరికాదని గతంలో ఎమ్మెల్యే మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని గడిచిన జులై 10వ తేదీన హామీ ఇచ్చారని ఆ హామీ తీరి మరొక మూడు నెలల గడిచిందని అలాగే స్పందనలో పలు పర్యాయాలు అర్జీ పెట్టమని మూడు కోట్ల 88 లక్షల బడ్జెట్ సమావేశం అయిందని త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీ గడువు కూడా అయిపోయిందని కావున ఒకసారి మా రోడ్డు విషయమై ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తామని చెప్పినా వినకుండా అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ ప్రజాస్వామ్య మార్గంలో శాంతియుతంగా మా సమస్యను తెలియజేయటానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రకమైన అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని కనీసం వినతి పత్రం ఇవ్వటానికి కూడా వీల్లేదు అనటం ఎక్కడ ప్రజాస్వామ్యం చెప్పాలని ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడగడం తప్ప రోడ్డు నిర్మాణం కోరుకోవడం తప్ప అని ప్రశ్నించారు
మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ పౌరులుగా మా సమస్య మీద ఎమ్మెల్యే గారికి విన్నవించాలని ప్రయత్నం చేస్తుంటే ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు అని పోలీస్ లెక్కనైనా ఈ పద్ధతులు విడనాడాలని అన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది టిడిపి నేతలు కార్యకర్తలు ధర్నా నిర్వహించారుఅరెస్టు చేసిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ వేములపల్లి శ్రీనివాస్ గొల్లమందల శ్రీనివాస్ కోనేటి చంటి తడికల మోహన్ నూనె పల్లారావు ఉన్నారు
ఈ కార్యక్రమంలో ఆకుమర్తి రామా రావు కుక్కల మాధవరావు, తూటి కుంట రాము పగడం సౌభాగ్యవతి కరుటూరి రమాదేవి కోటగిరి ప్రమీల , కన్నా లక్ష్మీ, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు,మానికల సూరిబాబు, ఎలికే ప్రసాద్ భూస సత్యనారాయణరెడ్డి రాగానే రామకృష్ణ రాగాని వంశీ గడ సుబ్రహ్మణ్యం పోల్నాటి సత్యనారాయణ పోలనాటి చినబాబు కొంచాడ ప్రసాద్ ముళ్ళపూడి శ్రీనివాస్ గంటా రామారావు ఆనంద్ కుమార్ సత్య యాదవ్ బోడ శ్రీనివాస్ పాకనాటి అంజి ఎడ్లపల్లి ఏడుకొండలు క్రిష్ నాని అప్పారావు కృష్ణంరాజు చలంకూరి బాబి,మానికల వెంకటేశ్వరరావు సీతారామరాజు జొన్నకూటి శ్రీను నజీర్ రాగానే వంశీ దంసెల్లి అంజి వీరమల్ల పోసి బాబు నందిపం సర్వేశ్ తారిపురెడ్డి రామకృష్ణ పులపాకుల విజయ్ గడిబోయిన రాధాకృష్ణ కృపవరం కాగితాల రాంబాబు ఎడ్లపల్లి పవన్ దాసరి శ్రీను వెంకట్ ఎడ్లపల్లి నరేష్ పోడుదల మధు దుర్గారావు, ఉదయ్,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు





