జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి 9:

ఈ రోజు వైర్ రాడ్ మిల్-2 సీఐటీయూ నూతన కమిటీ ని డ బల్యు అర్ యం 2 విభాగాధిపతి కె.వి.దినకర్ కి సీఐటీయూ గౌరవ అధ్యక్షులు, ఉక్కు పోరాట పరిరక్షణ కో కన్వీనర్ జె. అయోధ్యరాం, ప్రధాన కార్యదర్శి యూ. రామ స్వామి, అధ్యక్షులు వై.టి.దాసు లు సమర్పించారు. ఈ సందర్బంగా జె. అయోధ్యరాం మాట్లాడుతూ గడిచిన డిసెంబర్ నెలలో డ బ ల్యు అర్ యం2 రేటెడ్ ఉత్పత్తి కన్నా 20% అధికంగా అంటే 120% ఉత్పత్తి ని సాధించారు. కాబట్టి పెరిగిన ఉత్పత్తి కి అనుగుణంగా ఇన్సెంటివ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో జనవరి 30 వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభలో ఉక్కు కార్మికులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికులు కుటుంబాలతో సహా పాల్గొని సభకి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి యూ. రామ స్వామి మాట్లాడుతూ వేతన ఒప్పందం సమయానికి జరగపోయినప్పటికి, పాత ఇన్సెంటివ్ కు కోతపెట్టి కార్మికుల ఆర్ధిక ప్రయోజనాలు దెబ్బతీసినప్పటికి కార్మికులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి రికార్డ్ ఉత్పత్తి సాధించడం అభినందనీయమన్నారు. అధ్యక్షుడు వై.టి.దాస్ మాట్లాడుతూ ఉత్పత్తి విషయంలో యాజమాన్యానికి సహకరిస్తూనే కార్మికుల హక్కుల, ప్రయోజనాల పరిరక్షణ కోసం సీఐటీయూ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైర్ రాడ్ మిల్2 ఆపరేషన్స్ ఇంచార్జి నారాయణ రావు, మెకానికల్ విభాగాధిపతి బేగ్ , డ బ ల్యు ఆర్ యం కార్యదర్శి సి.హెచ్.అరుణ్ కుమార్, అధ్యక్షుడు ఆర్. రామ్మోహన్ రావు, త్రిఫ్ట్ డైరెక్టర్ కర్రి శ్రీనివాస్, టి. శ్రీనివాసులు యస్. సంతోష్ కుమార్, పంకు చిన్నారావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.





