జన సముద్రం న్యూస్, జనవరి 8, దామర చర్ల మండలం (మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె ).
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండ లంలో గ్రామాలైన కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టెకుంట గ్రామాల నందు సుమారు 60 లక్షల రూ.. వ్యయంతో నూతన గ్రామ పంచాయితి భవనాలకు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. ఇంతే కాకుండా దామరచర్ల మండల పరిధిలోని 12 గ్రామ పంచాయితిల నందు 2 కోట్ల 60 లక్షల రూ..వ్యయంతో నూతన సి.సి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భాస్కర్ రావు తో పాటు దామచర్ల మండలం ఎంపీపీ ధీరావత్ నందిని, జడ్పిటిసి అంగోతు లలిత, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కుందూరు వీర కోటిరెడ్డి, డీసీఎంసీ వైస్ చైర్మన్ దుర్గెంపూడి నారాయణరెడ్డి, ఎంపీటీసీలు.. సోము సైదిరెడ్డి.. లు,బి ఆర్ఎస్ నాయకులు.. ధీరావత్ రవితేజ, అంగోతు హతిరాం.. లు, గోపి,రఫీ, బి ఆర్ ఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.