

మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్
మౌలాలి138డివిజన్లోని క్రియేటివ్ నగర్ లో 23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా క్రియేటివ్ నగర్ నివాసితులు డ్రైనేజ్ వాటర్ తోను, వర్షపునీరుతోను ఇబ్బందులు పడుతున్నారు, కాలనీ పల్లం ప్రాంతం అవడంతో నీరు ఎప్పుడూ కాలనీలోని రోడ్లమీద నిలిచిపోతోందని, జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి సాంక్షన్ చేయించారు, ఎన్నో సంవత్సరాలుగా కాలనీవాసులు పడుతున్న బాధలను పరిష్కారం ఈరోజు ఈ పనులతో సాధ్యమైంది అని కాలనీవాసులో ఆనందం వ్యక్తం పరిచారు, ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నేటికీ మా సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు మా కాలనీ అభివృద్ధికి తోడ్పడినందుకు స్థానిక కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో క్రియేటివ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ లోకనాథం, ఆర్ఎస్ వి ప్రసాద్, మహేశ్వర్, రాము , రామ్ రెడ్డి , శ్రీధర్ , రవీందర్ , అప్పారావు ప్రసాద్, పరమేష్ , గణేష్ ,బ్రహ్మచారి కోటేశ్వరరావు , వేణుగోపాల్ , పద్మ , మరియు మల్కాజ్గిరి బిజెపి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్, బిజెపి డివిజన్ అధ్యక్షులు సాయిబాబు, డివిజన్ బిజెపి కార్యదర్శి శివ గౌడ్ , ఓబిసి నాయకులు రాము, రమణ, కిరణ్ శ్రే, చింతల శేఖర్, ఉపేంద్ర , బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.