కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో 20 ఎమ్మెల్యేలు 3 లోక్సభ స్థానాలపై కన్నేసినట్టు తెలిసింది. జగన్ మధ్యవర్తిత్వంతో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయ మూడ్ కోసం సిద్ధమవుతున్న సమయంలోనే కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వాతావరణం నెలకొన్నాక కేసీఆర్ చక్రం తిప్పుతారని.. ఏపీలోని 20 అసెంబ్లీ 3 లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోందని సమాచారం. తెలంగాణ-ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోందని తెలుస్తోంది. అక్కడే తమ బలం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.ప్రధానంగా కేసీఆర్ టార్గెట్ చేసింది కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో అని.. ఈ జిల్లాలకు ఆనుకొని ఉన్న తెలంగాణ సరిహద్దుల్లోనే పోటీచేయాలని చూస్తున్నారు. ఇక్కడ సరైన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. తన నియోజకవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను బీఆర్ఎస్ ఏపీ వింగ్ చీఫ్గా కేసీఆర్ నియమించారు. అసలు ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపుతుందా? త్వరలోనే తెలుస్తుంది.
ఏపీలో ఇంతకాలం బీసీలు తమను పార్టీలు వాడుకుంటున్నారని కానీ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకున్నా ప్రభావిత సీట్లు వస్తే మాత్రం ప్రభుత్వ ఏర్పాటు లో కీలకం కానున్నారు. అటు జగన్ సాధించలేని సీట్లను బీఆర్ఎస్ గెలిపించి ఆయన ఖాతాలో వేయనుందా..? అనేది చర్చ సాగుతోంది. మొత్తంగా కాపు బీసీ ఓట్లను ఇతర పార్టీలకు వెళ్లకుండా కేసీఆర్ జగన్ స్కెచ్ వేశారా..? అని అనుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ బీసీ ఓట్లను గనుక కేసీఆర్ ప్రభావితం చేస్తే మాత్రం వైసీపీ మినగా మిగతా పార్టీలకు గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు స్పీడ్ పెంచుతామన్నారు. ఇప్పటికే ఏపీకి అధ్యక్షుడిని నియమించిన ఆయన మిగతా రాష్ట్రాల్లోనూ కమిటీలు వేస్తామన్నారు.