వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జీతం 15 వేలు చేస్తామంటూ వాలంటీర్లకు వైసీపీ మంత్రి బంపర్ ఆఫర్..!

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 06:

ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల వద్దకు గడపగడప పేరిట పంపుతూనే.. మరోవైపు వలంటీర్లను కూడా భారీగానే వాడుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వలంటీర్లకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బృహత్తర బాధ్యతను వైసీపీ అదిష్టానం.. నెత్తికెత్తినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన ప్రకటన చేశారు. “ప్రస్తుతం వలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారి సేవలను ఎంత పొగిడినా తక్కువే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లాగా పనిచేస్తున్నారు. అయితే.. వారి సేవలు మరింత పెరగాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అన్ని నియోజకవర్గాల్లోనూ  గెలిపించేలా వలంటీర్లు పనిచేయాలి. వైనాట్ 175 నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలి.`అని మంత్రి సూచించారు.అదేసమయంలో వలంటీర్లకు తాయిలం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే.. అది కూడా 175/175 సీట్లుసాధిస్తే.. వలంటీర్ల వేతనాన్ని మూడు రెట్లు పెంచుతామని.. మంత్రి సంచలన ప్రకటన చేశారు. వాస్తవానికి ఇప్పటికే.. ఏ ఎన్నిక జరిగినా వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది ఇక ఇప్పుడు సార్వత్రిక సమరంలోనూ  వారిని ప్రధానంగా మార్చే ప్రయత్నం చేయడం గమనార్హం. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్