తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా..!

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 5:

హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట తరుచూ వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఓ యువకుడు తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అమీర్ పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను 28ఏళ్ల యువకుడు నడిపిస్తున్నాడు. అతనికి గతేడాది జూలైలో ఓ వ్యక్తి పరిచయం అయ్యారు. అతడి వయస్సు సుమారు 30 ఏళ్లు. కాగా ఆ వ్యక్తి తన తండ్రి అనంతపురంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారని.. తాను సైతం వైస్ఆర్టీపీ హైదరాబాద్ నగర పార్టీకి కాబోయే అధ్యక్షుడినని జీపీఎస్ ఇన్ఫోటెక్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు.

తనకు జీపీఎస్ ఇన్ఫోటెక్ ఆఫీసులో కొంత భాగాన్ని అద్దెకివ్వాలని కోరగా నిర్వాహకుడు అంగీకరించాడు. ఈ మేరకు 40వేల అడ్వాన్స్ నెలకు 15వేల అద్దెతో కార్యాలయంలో కొంత భాగాన్ని అతడికి అద్దెకు ఇచ్చాడు. వీరిద్దరి సుమారు ఒకే వయస్సు కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇదే అదునుగా భావించిన అద్దెకు ఉన్న వ్యక్తి ఐటీ నిర్వాహకుడి నుంచి 86వేల అప్పుగా తీసుకున్నాడు. మరోసారి తన తండ్రి పేరు చెప్పి తనకు ఏపీ.. తెలంగాణలో భారీగా ఆస్తున్నాయని నమ్మబలికించాడు.

ఈ క్రమంలోనే విడతల వారీగా ఐటీ నిర్వాహకుడి నుంచి 26 లక్షల 95వేలు అప్పు గా తీసుకున్నాడు. అయితే ఈ డబ్బును ఎంతకీ తిరిగి చెల్లించకపోవడంతో అనుమానంతో ఆ వ్యక్తి గురించి ఆరా తీశాడు. దీంతో ఆ వ్యక్తి అమీర్ పేటలోని అంకమ్మ బస్తీలో నివాసం ఉంటాడని తెలుసుకున్నాడు. అతడి కుటుంబం సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడుతుందని తెలుసుకొని విస్తుపోయాడు.ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొని ఎఎస్సాఆర్ నగర్ పోలీసులకు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరీ ఐటీ నిర్వాహాకుడి డబ్బులను పోలీసులు ఏమాత్రం రికవరీ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే..!   

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

భర్త లేని లోకంలో ఉండలేను

Spread the love

Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్