తిరుపతి జిల్లా , జనసముద్రం, రిపోర్టర్ హరినాథ్,జనవరి 5:
రేణిగుంట ;మండలంలోని గుత్తివారిపల్లి గ్రామానికి చెందిన స్మశాన దారిని తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యశ్వంత్ బాబు వెంచరేసిన 38 ఫ్లాట్లకు దారి కోసం గ్రామ అభివృద్ధికి లక్షల రూపాయల్లో డబ్బులు ఇస్తానని కొంతమంది స్థానిక పెద్దలకు ఎరచూపి.. స్మశాన దారిని కబ్జా చేసి సీ.సీ. రోడ్డు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడంతో ఇది తెలిసిన గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు స్మశాన దారి కబ్జాను అడ్డుకోవడం, అదే విధంగా ‘ఈ ఫ్లాట్లకు దారి లేదు అనే హెచ్చరిక బోర్డు’ రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యతిరేకంగా పెట్టి స్మశాన దారి కబ్జా నుండి కాపాడుకోవడానికి బుధవారం నాడు మీడియా ప్రతినిధులను గ్రామానికి పిలిపించి వారి సమక్షంలో స్మశాన దారిలో నిలబడి నిరసన తెలుపుతూ.. గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని సిపిఎం పార్టీ రేణిగుంట రూరల్ కార్యదర్శి ఎం. చీరాలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తివారిపల్లికి చెందిన మా ఊరి స్మశానదారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్లాట్లకు దారి అనుమతి ఇవ్వకూడదు, స్మశానంకు వెళ్లే దారిని మా గ్రామ ప్రజలు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రేణిగుంట మండల (తాసిల్దార్ శివప్రసాద్) ను సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి (ఎం. చీరాలయ్య,) రూరల్ ఏరియా బాధ్యుడు (కె.సెల్వరాజ్) డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మా గ్రామ స్మశాన దారిని కాపాడుకునేందుకు గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయవలసి వస్తుందని గురువారం నాడు ఒక ప్రకటన ద్వారా మండల అధికారులను హెచ్చరించారు.