భారత్ పై అణు యుద్ధం చేస్తానన్న పాకిస్థాన్..ఇప్పుడు అడుక్కుతింటోంది

Spread the love
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:

ఇంకేముంది.. భారత్పై అణుయుద్ధమే చేస్తాం.. అంటూ కోతలు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?  మాటలు కోటలు దాటించిన పాకిస్థాన్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్కతింటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. దీనికి కారణం.. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే!

అంతేకాదు… పూటగడవని స్థితిలో ఉన్నాం.. తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థలతోపాటు వివిధ దేశాలను పాక్ ప్రభువులు వేడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపలేక ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం వంటి చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఉన్న ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది.
వాషింగ్టన్లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. జువిష్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 6.8 మిలియన్ డాలర్లతో అత్యధికంగా బిడ్ను వేసినట్లు తెలిపింది. ఇందులో రెండో స్థానంలో భారత్కు చెందిన రియాల్టీ సంస్థ నిలిచింది. 5మిలియన్ డాలర్లతో భారత్ సంస్థ బిడ్ వేయగా.. పాకిస్థాన్కు చెందిన మరో రియాల్టీ సంస్థ 4మిలియన్ డాలర్లను కోట్ చేసింది.
పాకిస్థాన్కు వాషింగ్టన్లోని రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. వాషింగ్టన్ నగరంలోని ప్రధాన కేంద్రమైన ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1953-56లో అప్పటి పాకిస్థాన్ రాయబారి సయ్యద్ అంజద్ అలీ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2000 వరకు అందులో కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త భవనంలో పాక్ ఎంబసీ కొనసాగుతోంది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి