

జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి
(డిసెంబర్ 28)
పాఠశాలల్లో స్కూల్ సేఫ్టీ క్లబ్ కమిటీల ద్వారా విద్యార్థి భవిష్యత్ కు బంగారు బాట పెంపొందించేందుకు వీలుంటుందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలియజేశారు ,ఈ సందర్భంగా బుధవారం మదీనాగూడ రామకృష్ణ నగర్ లోని కల్లం అంజి రెడ్డి కళాశాలలో ఏర్పాటుచేసిన స్కూల్ సేఫ్టీ క్లబ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

అనంతరం డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ సైబరాబాద్ పోలీసుల సహకారంతో మాదాపూర్ పరిధిలోని అన్ని పాఠశాలలో మాదకద్రవ్య నిరోధక కమిటీలను ,స్కూల్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి వారికి సరైన క్రమ శిక్షణ తరగతుల ద్వారా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ పాటశాల ప్రాంగణంలోని పిల్లల కు విద్యార్థి దశ నుంది మంచి అలవాట్లను,నడవడికను ఏర్పర్చుకునే వీదంగా స్కూల్ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో తో ఈ స్కూల్ సేఫ్టీ క్లబ్ ఏర్పటు ముఖ్య కారణం అని డీసీపీ తెలిపారు,దీనిని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు,విద్యార్థులు దురలవాట్లను ఎప్పటికప్పుడు ముందుగానే గమనించి వాటికి దూరంగా ఉండాలి,శారీరక శ్రమ చేసీ శరీరాన్ని,మానసికంగా దృఢంగా ఉంటు మనస్సును ,ఆలోచనలను మంచి క్రమశిక్షణ తో అభివృధి సాధించాలని కోరారు,తల్లి తండ్రులకు మంచి పెరు తీసుకురావలని కొరారు, ఏ స్వార్దం లేకుండా విద్యార్థి కి విద్య నేర్పించే గురువులను మనం గౌరవించుకోవాలని డీసీపీ కోరారు ,సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో వీదిగా స్కూల్ సేఫ్టీ క్లబ్ లను ప్రారంభించటం జరుగుతుంది అని తెలిపారు, ఈ కమిటీల ద్వారా అవగాహన సదస్సును స్కూల్, కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు సరైన అవగాహన తరగతులు నిర్వహించి వారి భవిష్యత్తును సరైన పద్ధతిలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటారని దీని ద్వారా బాల్యం నుంచి బంగారు భవిష్యత్ ఏర్పడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు,సబ్ ఇన్స్పక్టర్ రవి కుమార్, ఎస్సీఎస్సీ గాయతి,ప్రిన్సిపల్ శైలజ, డాక్టర్ అంజనీ కుమార్,మల్లీశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లదండ్రులు పాల్గొన్నారు.