మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:

ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు కదా. మరి ఎన్నికలు పదిహేను నెలల దూరంలో ఉండగా మరోసారి మంత్రులను తప్పించడం అవసరమా. కొత్తవారికి ఎందుకు చేర్చుకుంటున్నారు. ఉన్న వారిని ఎందుకు వద్దు అనుకుంటున్నారు.

అసలు మంత్రివర్గం విస్తరణ అంటనే అదొక రాజకీయ రచ్చ. అలాంటి సాహసం జగన్ చేస్తారా. అలా చేయాలనుకుంటే దానికి దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి. ఇదే ఇపుడు వైసీపీ లోపలా బయటా పెద్ద ఎత్తున చర్చగా ఉంది మరి. ఇక జగన్ విషయం చూస్తే ఆయన రెండు నెలల క్రితం ఒక మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అని వార్తలు వచ్చాయి.మీరు పనితీరు మార్చుకోకపోతే  రెండు నెలలలో  మార్చేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది అని ప్రచారం జరిగింది. అయితే ఆ రెండు నెలలు ఇపుడు ముగిసాయా డెడ్ లైన్ పూర్తి అయింది కాబట్టి మంత్రి వర్గ విస్తరణ పేరిట పనిచేయని వారిని జగన్ మాజీలను చేస్తారా అన్నదే చూడాలని అంటున్నారు. ప్రస్తుతానికి చూస్తే జగన్ కి మంత్రి వర్గ విస్తరణ మీద కొత్త ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహిస్తున్న గడప గడపకూ కార్యక్రమానికి జనంలో పెద్దగా స్పందన లేదు అని పేకీ టీం ఒక నివేదిక ఇచ్చింది అని చెబుతున్నారు. ఇక గడప గడపకు వెళ్ళడానికి అక్కడ జనంతో మమేకం కావడానికి ఎమ్మెల్యేలు పెద్దగా సీరియస్ గా లేరని ఉత్సాహం చూపించడంలేదని కూడా పీకే టీం ఒక విలువైన సమాచారాన్ని తీసుకొచ్చిందట. ఎందుకు అంటే జనాలు రోడ్ల గురించి అభివృద్ధి గురించి అడుగుతున్నారని ఆ నివేదిక సారాంశం అంటున్నారుఇక చేసిన పనులకు బిల్లులు రాలేదని క్యాడర్ మరో వైపు ఆవేదన వ్యక్తం చేయడంతో రెండిందాలా తలనొప్పులతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళడానికి ఆసక్తిని చూపించడంలేదు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఉన్న మంత్రులలో సీరియస్ నెస్ లేకపోవడం వారు పెద్దగా పట్టనట్లుగా ఉండడంతో ఇపుడు రాజకీయంగా ఏమేమి చేయాలి అని ఆలోచిస్తే పనితీరు బాగులేని మంత్రులను తీసేయాలి అని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచన చేస్తోందిట.

దీని వల్ల రెండు విధాలుగా లాభాలు ఉంటాయని రాజకీయంగా కూడా వేడి పుడుతుందని భావిస్తున్నారుట. ఉన్న మంత్రులలో ముగ్గురికి ఝలక్ ఇచ్చి మాజీలను చేస్తే కచ్చితంగా అది ఇతర మంత్రులకు చురుకుదనం పుట్టిస్తుంది. తమ మంత్రి పదవి 2024 ఎన్నికల దాకా అని ఎవరూ నిబ్బరంగా ఉండలేరు. దాంతో ఏదో విధంగా ఉన్న సమస్యలను నెట్టుకుని జనాల్లోకి వెళ్తారు. ఇక కొత్తగా ముగ్గురుని చేర్చుకుంటున్నారు. అంటే ఆశావహుల్లో కూడా ఆశలు పుడతాయని అంటున్నరు.

అలా ఆశలు పెంచుకుంటున్న ఎమ్మెల్యేలు  కూడా మరిన్ని విస్తరణలు ఉంటాయన్న దాంతో జనంలోకి పరుగులు పెడతారు అని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా ఎమ్మెల్యేలను  మంత్రులను గడప గడపకు చేర్చడంతో పాటు  ఎన్నికలకు సమాయత్తం చేయడానికి కూడా ఈ విస్తరణ మంత్రం ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఒక విధంగా మంత్రి వర్గ విస్తరణ అంటేనే తేనే తుట్టెను కదిపినట్లుగా భావించాలి.ఇక ఇప్పటిదాకా జగన్ 150 ఎమ్మెల్యేలలో ఒక నలభై మంది దాకా ఎమ్మెల్యేలకు మంత్రులుగా చేశారు. అవకాశం ఉంటే మరో ముగ్గురుకి దక్కుంది.అక్కడికీ వంద మంది ఎమ్మెల్యేలు నిరాశలోనే ఉంటారు. ఎన్నికలు చూస్తే ఎంతో దూరం లేవు అందువల్ల విస్తరణ పేరిట పాతవారిని తప్పించి కొత్తవారికి ఇచ్చినా అనుకున్న ఉత్సాహం సీరియస్ నెస్ వస్తుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఊస్టింగ్ అయ్యే ఆ ముగ్గురు మంత్రులు ఎవరూ కొత్తగా చేరే మరో ముగ్గురు ఎవరూ అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉందిట. మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో జగన్ కొత్త ఏడాది వైసీపీకి కొత్త ఉత్సాహం తెస్తారా కొత్త చిక్కులు వస్తాయా అనేది చూడాల్సి ఉంది అంటున్నారు.

Related Posts

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

Spread the love

Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం